ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల మీద దాడులు పెరిగాయి. అయితే ఆ దాడులను ప్రతిఘటించే దానిలో భాగంగా మావోయిస్టులు కూడా ఊహించని విధంగా ఎదురుదాడులు తివ్రతతరం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం పామేడు వద్ద ఉన్న చింత వాగు 151 బెటాలియన్ పై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడి చేశారు. దాదాపు 2000 మంది ప్రజలతో కలిసి వచ్చి దాడులు చేశారు అయితే ఈ సమయంలో బెటాలియన్ లో బారి గా అయుడాలున్నాయి. ఈఆయుధాలని అపహరించడం కోసమే ఈ దాడులు చేసినట్టుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అబుజు మడ్ నీ టార్గెట్ చేసుకుని పోలీసు బలగాలు తరలి వెళ్తుండగా భద్రత బలగాల చూపు మరల్చే విధంగా మావోయిస్టులు కూడా బెటాలియన్ ల మీద దాడులు చేస్తున్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఆపరేషన్ ప్రహర్ పేరు తో దాడులు చేయగా తాజాగా మళ్లీ బిజెపి అధికారము లోకి వచ్చిన తర్వాత సూర్య శక్తి పేరుతో ఆపరేషన్ ను ఛత్తీస్ గడ్ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు.
జనవరి 16 సాయంత్రం 7 గంటలకు కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఆటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఎటు నుండి బాంబులు వస్తున్నాయో తెలియక
పామేడుతో పాటు, ధర్మారం పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు రాత్రంగా బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. మావోయిస్టులు పోలిస్ బేస్ క్యాంపులే లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. మొదట పామేడు రహదారిపై చెట్లు నరిక రహదారికి ఆటంకం కలిగించారు. మూడు బేస్ క్యాంపులే లక్ష్యంగా చేసుకుని నాలుగు వైపులా చుట్టుముట్టి కాల్పులకు దిగారు. మావోల ముప్పేట దాడికి అప్రమత్తం అయిన భద్రతా
బలగాలు వారిపై కాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడంతో మావోయిస్టులు మాటు వేసిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పారా లైట్లను ఉపయోగించి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.