మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టులు అందరూ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు. ఆశన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పని చేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం అని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు.
‘ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం తప్ప తమ పంథాలు మర్చిపోము. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. సహచరులందరూ ఎక్కడ వారు అక్కడ లొంగిపోవడం మంచిది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట వరకే జనజీవ స్రవంతిలో కలుస్తున్నాం. ఉద్యమంలో ఎంతోమంది అమరులైనారు వారందరికీ జోహార్లు’ అని ఆశన్న సహచరులను ఉద్దేశించి మాట్లాడారు.
Also Read: Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్’పై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లపైనే. 40 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు ఆశన్న ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు 1 నుంచి 5వ తరగతి వరకు లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారు. హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్య పూర్తి చేశారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ ఆర్‌ఎస్‌యూకి నాయకత్వం వచించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆశన్న 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు.
