Site icon NTV Telugu

Maoist Hidma : మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌

Hidma

Hidma

మావోయిస్ట్‌లకు షాక్‌ తగిలింది. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. గ్రే హౌండ్స్ బలగాల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత హిడ్మా మృతి చెందాడు. తెలంగాణ గ్రే హౌండ్స్ ఆపరేషన్‌లో బీజాపూర్ తెలంగాణ బార్డర్ లో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రే హౌండ్స్, సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే.. హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉంది. 1996-97లో మావోయిస్టు పార్టీలో హిడ్మా చేరాడు. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు.

Also Read : Married Woman Molested: రుణం ఇప్పిస్తానన్నాడు.. బైక్ ఎక్కగానే షాకిచ్చాడు

హిడ్మా స్వగ్రామం ఛత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి. ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా ఉద్యమంలోకి రాక ముందు వ్యవసాయం చేసేవాడు. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వార ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడిగా మారాడు హిడ్మా. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించాడు హిడ్మా. ఇదిలా ఉంటే.. హిద్మా మృతిని ఇంకా మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు.

Exit mobile version