Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Maoist Commander Vanjam Kesha Surrenders Warangal

Maoist : మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ

Published Date :February 21, 2025 , 4:42 pm
By Gogikar Sai Krishna
  • మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు
  • ఎన్‌కౌంటర్ల ప్రభావం – మావోయిస్టుల్లో లొంగుబాటుకు ఆసక్తి
  • తెలంగాణలో మావోయిస్టుల చరిత్ర ముగిసే దిశగా..?
Maoist : మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maoist : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్భందాలతో పాటు వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోంది. అనేక మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణిస్తుండగా, మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది.

వంజెం కేషా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందినది. చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేసిన ఆమె, మావోయిస్టు పార్టీలోని సభ్యులతో పరిచయం పెంచుకుంది. 2017లో పామెడ్‌ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరింది. 2019లో కేషా అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ అయ్యింది. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి (కొసా)కు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమితమైంది. 2021లో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఆమెను ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి కల్పించింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్‌గా పని చేసింది.

Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..

ఈ కాలంలో మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ (ప్రస్తుతం మహారాష్ట్ర జైలులో ఉన్నాడు)ను వివాహం చేసుకుంది. ఉత్తర బస్తర్ డివిజన్‌లో కొంతకాలం సేవలందించిన అనంతరం, 2024 ఏప్రిల్‌లో మళ్లీ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది.

వంజెం కేషాపై ప్రభుత్వ ప్రతిష్టగొన్న ₹4 లక్షల రివార్డు ఉంది. పోలీసుల ఎదుట లొంగడానికి పలు కారణాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కఠినంగా మారిన పోలీసులు దాడులు: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టుల సంఖ్య తగ్గుతోంది. మావోయిస్టుల తీరుపై స్థానిక ప్రజల ఆగ్రహం పెరిగింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాలు అందిస్తోంది.

కేషా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించింది. కొహిలబేడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది, ఈ దాడిలో ఒక పోలీస్ అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అబుజ్‌మడ్ ప్రాంతంలో పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మరో అధికారి మరణించాడు.

వంజెం కేషా లొంగుబాటు నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పునరావాస పథకాలు కీలకంగా మారాయి. లొంగుబాటు చేసిన వారిని సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అన్ని విధాలుగా ఆదుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి మరోసారి దెబ్బ తగిలినట్టైంది.

Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amber Kishore Jha
  • law and order
  • Maoist
  • Maoist commander
  • surrender

తాజావార్తలు

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions