NTV Telugu Site icon

Maoists : దండకారణ్యంలో మావోయిస్టు వారోత్సవాలు

Maoists

Maoists

చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని అబూజ్ మద్ తో పాటు దండకారణ్యం ప్రాంతాల్లో మావోయిస్టు వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుని పడుతున్నప్పటికీ మరోవైపున మావోయిస్టు పార్టీ తమ కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉంది తాజాగా దండకారణ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమీకరణ అయ్యారు. పలు గ్రామాల గిరిజనుల ను ఒక చోటికి చేర్చి మావోయిస్టు వారోత్సవాలని నిర్వహించారు.. అమరులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన రామకృష్ణ తో పాటు డప్పు రమేష్ ,నర్మద ఇంకా పలువురి ఫోటోలని దండకారణ్యంలో ఒక చోట ఏర్పాటు చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించారు .అంతేకాకుండా స్థూపాల నిర్మాణం చేపట్టి అమరులకి వందనాలను చేశారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ గిరిజనులని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మావోయిస్టులు విడుదల చేసిన వీడియోలో స్పష్టం అవుతుంది .అయితే ఇదే వీడియోలో తెలుగులో కూడా పాటలు పాడుతూ మావోయిస్టు అమరులకి శ్రద్ధాంజలి ఘటించారు..

Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ.. వారి మధ్యలో నలిగిపోయిన అబ్బాయి ఏం చేశాడంటే..?

Show comments