Maoist Bunker Seized: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీలో నక్సల్స్ బంకర్‌ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే, కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇక, ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: NTR’S Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
కాగా, బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక ఫారెస్ట్ ఏరియాలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నారు. ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ , ఇరాక్ లాంటి దేశాల్లో తీవ్రవాదులు ఉండే ప్రదేశాల్లో ఇలాంటి బంకర్లు మనకి కనిపిస్తుంటాయి.
Read Also: Budget Session : జనవరి 31నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంతకాలం కొనసాగుతాయో తెలుసా ?
అలాగే, దంతేవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మ జిల్లాల్లో వేల మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ కోబ్రా బలగాలు అనువణువున గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న భారీ ఎన్ కౌంటర్లో 15 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్రెల్లి దండకారణ్యంలోని తెలంగాణ జిల్లాల్లోని తాళి పేరు నది వెనుక సమీపంలో మావోల బంకర్ ను డీఆర్జీ సైన్యం గుర్తించింది.