Bharath bandh: నేడు “భారత్ బంద్”.. ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharath bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కి నిరసనగా నేడు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చెప్పారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐబీ పోలీసులు అతన్ని పట్టుకుని.. 15న అరెస్ట్ చేసి, 18వ తేదీన హిడ్మాను బుటకపు ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్ ఆరోపించారు. కాగా.. నేడు నిరసన వ్యక్తం చేయాలని భారత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం, రంపచోడవరం ప్రాంతంతో పాటు భద్రాచలం ఏజెన్సీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
READ MORE: YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)
Also Read
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
తాజావార్తలు
-
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
-
Mega158 : ఫాదర్స్ డే పిక్స్ లో కనిపించని చిరు… ఇదేనా కారణం ?
-
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జులై 6కు వాయిదా
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు
-
Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లో మద్యం, సిగరెట్లు, బాత్రూమ్ సీక్రెట్స్ పై దివ్య అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!