Site icon NTV Telugu

Bharath bandh: నేడు “భారత్ బంద్”.. ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..

Bharath Bandh

Bharath Bandh

Bharath bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కి నిరసనగా నేడు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్‌ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చెప్పారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐబీ పోలీసులు అతన్ని పట్టుకుని.. 15న అరెస్ట్‌ చేసి, 18వ తేదీన హిడ్మాను బుటకపు ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్‌ ఆరోపించారు. కాగా.. నేడు నిరసన వ్యక్తం చేయాలని భారత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం, రంపచోడవరం ప్రాంతంతో పాటు భద్రాచలం ఏజెన్సీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

READ MORE: YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)

Exit mobile version