NTV Telugu Site icon

Sushil modi: సుశీల్ మోడీ మృతిపై ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురి సంతాపం

Sushil Modi

Sushil Modi

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలంతా ఆయనను స్మరించుకుని నివాళులు అర్పిస్తున్నారు. సుశీల్ మోడీ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సుశీల్ కుమార్ మోడీ ఆకస్మిక మరణం కోలుకోలేని లోటు అని ఆమె “ఎక్స్‌”లో రాసుకొచ్చారు. అతని సౌమ్య స్వభావం, సమర్థవంతమైన నిర్వాహకుడిగా సహకారం, ప్రజా జీవితంలో స్వచ్ఛత అతని వ్యక్తిత్వం ఆయన పనిలో ప్రతిబింబిస్తాయన్నారు. మోడీ ఉన్నతమైన ఆదర్శాలతో జీవించారన్నారు.

READ MORE: AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈఓ

సుశీల్ మోడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఆయనను స్మరించుకుంటూ ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు, ‘పార్టీలో నా విలువైన సహచరుడు, దశాబ్దాలుగా నా మిత్రుడు సుశీల్ మోడీ జీ అకాల మరణం పట్ల చాలా బాధపడ్డాను. బీహార్‌లో బీజేపీకి విజయాన్ని అందించారు. బీహార్‌లో బీజేపీ ఎదుగుదల, దాని విజయాల వెనుక అతని అమూల్యమైన సహకారం ఉంది. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో కష్టపడి, స్నేహశీలిగా ఉండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకున్న అవగాహన చాలా లోతైనది. పరిపాలనాదక్షుడిగా కూడా ఎన్నో ప్రశంసనీయమైన పనులు చేశారు. జీఎస్టీని ఆమోదించడంలో ఆయన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!’. అని రాసుకొచ్చారు.

సుశీల్ మోడీ మృతిపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ జేడీ నాయకుడు తేజస్వి, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాత్ , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Show comments