NTV Telugu Site icon

RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు

Rgi Airport

Rgi Airport

RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. ఆపరేషనల్స్ కారణం చూపుతూ విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణీకులకు సమాచారం అందించకపోవడంతో తెల్లవారుజామున 40 మంది ప్రయాణీకులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Read Also: Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం

విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించడంతో.. ప్రయాణీకులు సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విలువైన సమయం వృథా చేసారంటూ సిబ్బందిపై ప్రయాణికులు విరుచుకుపడ్డారు. ప్రయాణీకులను శాంతింప చేసిన సిబ్బంది, డబ్బులు రీఫండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు విమానాల.. చెన్నై, తిరుపతి, బెంగుళూరు, మైసూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది.

Show comments