NTV Telugu Site icon

Karepally : కారేపల్లి ఘటనపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి

Revanth

Revanth

Karepally : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి(Karepally), చీమలపాడు ప్రమాద ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబానికి, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షల నష్ట పరిహారం అందించాలంటూ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.

Read Alaso: Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సింగరేణి అధికారులు.. రెండో రోజు పర్యటన

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..
బీఆర్ ఎస్ స్వార్థ రాజకీయాలకు ముగ్గురు పేదలు అగ్నికి ఆహుతి అయ్యారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy) అన్నారు. ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాదం సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ముగ్గురి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు. గాయపడ్డ వారికి అతున్నత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలను బీఆర్ ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో చేస్తున్న రాజకీయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Alaso:Inter Results : తెలంగాణలో ఇంటర్ రిజల్స్.. రిలీజ్ ఎప్పుడంటే