Site icon NTV Telugu

Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!

Banks

Banks

వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది.

Also Read:Hyderabad : హైదరాబాద్‌ గతిని ఫోర్త్ సిటీ మార్చేస్తుందా..? సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్‌లో తిరుగుండదా?

ముఖ్యంగా సేవింగ్ ఖాతాలకు సంబంధించి కనీస సగటు నిల్వ లేకపోతే పెనాల్టీ విధిస్తుంటాయి. దీంతో కస్టమర్లకు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. మినిమం బ్యాలెన్స్ లేకపోతే విధించే ఛార్జీల నుంచి కొన్ని బ్యాంకులు మినహాయింపు కల్పించాయి. మీకు ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నట్లైతే ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

Also Read:Hyderabad : హైదరాబాద్‌ గతిని ఫోర్త్ సిటీ మార్చేస్తుందా..? సాఫ్ట్‌వేర్, రియల్ ఎస్టేట్‌లో తిరుగుండదా?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2020లోనే ఈ కనీస నిల్వలపై ఛార్జీలను ఎత్తివేసింది.

కెనరా బ్యాంక్‌

కెనరా బ్యాంక్‌ మే 2025 నెలలోనే దీనిపై ప్రకటన చేసింది. అన్నిరకాల పొదుపు (సేవింగ్స్‌) బ్యాంకు ఖాతాలు, శాలరీ అకౌంట్లు, ఎన్నారైల ఎస్‌బీ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలకు కనీస నిల్వ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

Also Read:Tamil Nadu Custodial Death: వెలుగులోకి పోస్ట్‌మార్టం రిపోర్ట్.. ఆందోళన కలిగిస్తున్న అంశాలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులు పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిర్వహించకపోతే వారిపై జరిమానా ఛార్జీలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు జూలై 1న ప్రకటించింది. కొత్త PNB నియమం జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. అన్ని పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది. జూలై 1 నుంచి, PNB సేవింగ్స్ ఖాతాలో MAB నిర్వహణ చేయనందుకు బ్యాంక్ ఇకపై రుసుము వసూలు చేయదు.

Also Read:Pawan Kalyan: తండ్రీ తనయులు.. పవన్‌, అకీరా, శంకర్‌ పిక్ వైరల్‌!

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

‘‘ఎలాంటి ఆందోళనలు లేని బ్యాంకింగ్‌ సేవలను అందిస్తున్నాం. ఇకపై కనీస బ్యాలెన్స్‌లపై ఎలాంటి అపరాధ రుసుములు ఉండవు. అన్ని సేవింగ్‌ ఖాతాలకు ఇది వర్తిస్తుంది’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జులై 2వ తేదీన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

Also Read:Konijeti Rosaiah : రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌, ఖర్గే

ఇండియన్‌ బ్యాంక్‌

జులై 7వ తేదీ నుంచి అన్ని సేవింగ్‌ ఖాతాలపై మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

Exit mobile version