NTV Telugu Site icon

Manu Bhaker: మను బాకర్‌కు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులెవరో తెలుసా?.. మనోళ్లే ముగ్గురు!

Manu Bhaker

Manu Bhaker

Manu Bhaker Favourite Cricketers: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను.. సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో కాంస్య పతకం గెలిచింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అయితే తనకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులు ఎవరో తాజాగా చెప్పింది.

Also Read: US Open 2024: నేటి నుంచే యుఎస్‌ ఓపెన్‌.. 25వ టైటిల్‌పై ‘రారాజు’ కన్ను!

క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీలను తాను ఎంతో ఇష్టపడతానని మను బాకర్‌ తెలిపింది. ‘క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీని ఎంతో అభిమానిస్తా. వారితో మాట్లాడే అవకాశం దొరకడమే గొప్ప గౌరవంగా భావిస్తాను. దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ నా ఫేవరెట్‌ క్రీడాకారుల్లో ఒకరు. బోల్ట్‌ను ఎంతో ఆరాధిస్తాను. అతడి జీవిత చరిత్రను చాలాసార్లు చదివా. బోల్ట్‌ ఇంటర్వ్యూలు కూడా చాలా చూశాను’ అని మను తెలిపింది.

Show comments