NTV Telugu Site icon

Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 10 17 At 2.47.12 Pm

Whatsapp Image 2023 10 17 At 2.47.12 Pm

వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది..ఈ మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, అర్చన జోయిస్, శ్రీమాన్, రావు రమేష్, అమర్ దీప్, నందు, అయ్యప్ప పి శర్మ మరియు రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ను ప్రముఖ యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ నిర్మించి డైరెక్ట్ చేశాడు. కొన్ని వారాలుగా ఈ సిరీస్ ను మేకర్స్ బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఈ మధ్యే మ్యాన్షన్ 24 ట్రైలర్ కూడా రిలీజైంది.

ఇది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమృత చుట్టూ తిరిగే కథ. ఆమె కనిపించకుండా పోయిన తన తండ్రి, ఆర్కియాలజిస్ట్ కాళిదాస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అతడు సున్నితమైన సమాచారాన్ని తీసుకొని విదేశాలకు పారిపోయాడన్న వార్తలు కూడా వస్తాయి. అయితే తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం కోసం అమృత ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది.అతన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన మ్యాన్షన్ కు ఆమె వెళ్తుంది. అక్కడ అస్సలు ఏం జరిగింది అనేదే ఈ మ్యాన్షన్ 24 సిరీస్.. ట్రైలర్ ప్రేక్షకులలో ఎంతగానో ఆసక్తి రేపింది. గతంలో దర్శకుడు ఓంకార్ రాజుగారి గది అనే హారర్ మూవీ తెరకేక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత తీసిన రాజుగారి గది 2 సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ ఆ తరువాత వచ్చిన రాజుగారి గది 3 అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఓంకార్ కాస్త గ్యాప్ ఇచ్చి మాన్షన్ 24 సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి నెలకొంది

Show comments