Site icon NTV Telugu

Mansion 24 : ఓంకార్ మాన్షన్ హౌస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…

Whatsapp Image 2023 10 10 At 11.21.03 Pm

Whatsapp Image 2023 10 10 At 11.21.03 Pm

రాజుగారి గది సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన యాంకర్ ఓంకార్ ఫస్ట్ టైమ్ మాన్షన్ 24 పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు.హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.ఈ సిరీస్‌లో సత్యరాజ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అవికా గోర్‌, బిందుమాధవి, నందు మరియు మానస్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్‌గా ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తుంది.బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస వెబ్‌సిరీస్‌లోనే నటిస్తోంది నటి బిందుమాధవి. మాన్షన్ 24లో ఆమె పాత్ర ఎంతో డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.మరోవైపు అవికాగోర్ మొదటి సారి వెబ్ సీరీస్ లో నటిస్తుంది.బాహుబలి లో కట్టప్ప పాత్ర ద్వారా ఎంతో ఫేమస్ అయిన సత్యరాజ్ నటిస్తోన్న ఫస్ట్ తెలుగు వెబ్‌సిరీస్ కూడా మాన్షన్ 24 కావడం విశేషం.ఇందులో సత్యరాజ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్ తండ్రీకూతుళ్లుగా కనిపించబోతున్నారు.

ఓ పాడుబడ్డ మాన్షన్‌లోకి వెళ్లిన కాళిదాస్‌(సత్యరాజ్‌) కనిపించకుండాపోతాడు.ఆ మాన్షన్‌లోకి వెళ్లిన ఎవరూ కూడా తిరిగిరారు. తండ్రి కోసం కొంతమంది మిత్రులతో కలిసి ఆ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది కాళిదాసు కూతురు. అక్కడ ఆమెకు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ..యాంకర్ గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ దర్శకుడు గా మాత్రం ఆ స్థాయిలో రానించ లేకపోతున్నాడు.జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ ఆ తరువాత రాజు గారి గది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.ఆ అ తరువాత రాజుగారి గది 2 కూడా మంచి విజయం అందుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన రాజు గారి గది 3 నిరాశ పరిచింది.రాజుగారి గది -3 తర్వాత డైరెక్షన్ కు బ్రేక్ తీసుకున్న ఓంకార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సిరీస్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Exit mobile version