Manoj Tiwary: హార్దిక్ ఇక చాలు.. కెప్టెన్సీ నుండి తప్పుకొని రోహిత్ కు అప్పగించు.!
- వరుస పరాజయాలతో ఒత్తిడిలో ముంబై ఇండియన్స్
- హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువ
- పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఓటమి
- క్వింటన్ డికాక్ శతకం చేసినా జట్టుకు ఉపయోగం కాలేదు
- హార్దిక్ పాండ్యా నాయకత్వంపై మనోజ్ తివారి తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Tiwary on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ఫామ్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో వెనుకబడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ క్వింటన్ డి కాక్ అద్భుత శతకంతో 195 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా కేవలం 17 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది.
ఈ మ్యాచ్ లో ముంబై జట్టు బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోయినా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టుకు భారీగా నష్టాన్ని కలిగించాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమన్ ధీర్ అవుట్ అయిన తర్వాత, ఫామ్ లో ఉన్న షెర్ఫేన్ రదర్ ఫోర్డ్ ను పంపకుండా హార్దిక్ స్వయంగా క్రీజ్‌లోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌పై మౌనం వీడిన ముంబై ఇండియన్స్.. కోచ్ ఏమన్నారంటే..?
రదర్ఫోర్డ్ ఆర్సీబీపై 31 బంతుల్లో 71 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతనికి తక్కువ బంతులు మాత్రమే లభించగా, హార్దిక్ మాత్రం 12 బంతుల్లో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ నిర్ణయం కారణంగా ముంబై 200కి పైగా స్కోర్ చేయగలిగే అవకాశం కూడా కోల్పోయింది. ఈ విషయమై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి హార్దిక్ కెప్టెన్సీపై తీవ్రంగా మండిపడ్డాడు. మ్యాచ్ లో కీలక సమయంలో తీసుకున్న నిర్ణయాలు అర్థరహితంగా ఉన్నాయని, జస్ప్రీత్ బుమ్రాను సరిగా వినియోగించకపోవడం కూడా పెద్ద లోపమని పేర్కొన్నాడు.
జట్టు ఓడిపోతే బాధ్యత తీసుకోవాలి. హార్దిక్ తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా అనిపించడం లేదు. రదర్ ఫోర్డ్ ను ముందుగా పంపాల్సింది, అలాగే బుమ్రాను స్ట్రాటజిక్ గా ఉపయోగించలేదని, కెప్టెన్సీలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. అంతేకాక, ముంబై ఇండియన్స్ సమస్యలకు పరిష్కారం కావాలంటే హార్దిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని తివారి సూచించాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడని.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో టైటిల్స్ గెలిచిందని గుర్తు చేశారు.
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
అయితే ముంబై మేనేజ్మెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకుని కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్ కు 2022లో టైటిల్ అందించిన హార్దిక్, ముంబై తరఫున మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో 19 ఓటములు చవిచూసింది.
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!