NTV Telugu Site icon

Manoj Tiwary Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్‌ తివారీ!

Manoj Tiwary

Manoj Tiwary

West Bengal Minister Manoj Tiwary retires from all forms of cricket: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్‌ తివారీ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘క్రికెట్ ఆటకు వీడ్కోలు’ అని తివారీ తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఆట తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఆద్యంతం తన పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మరియు దేవుడికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానని మనోజ్‌ తివారీ పేర్కొన్నారు.

బెంగాలీ క్రికెటర్‌ అయిన మనోజ్‌ తివారీ 2008 నుంచి 2015 వరకు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 12 వన్డేలు, 3 టీ20లు ఆడారు. వన్డేల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 104. మూడు టీ20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్‌ చేసిన మనోజ్‌ తివారీ..15 పరుగులు చేశారు. ఇక ఐపీఎల్‌లో 98 మ్యాచులలో 1695 రన్స్ చేశారు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 75 నాటౌట్.

Also Read: Wind Chimes at Home: ఇంట్లో ఈ దిశలో విండ్ చైమ్ ఉంటే.. 24 గంటల్లో అద్భుతం జరుగుతుంది!

మనోజ్‌ తివారీ 141 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9,908 పరుగులు చేశారు. ఇందులో 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 169 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 5,581 రన్స్ చేసిన తివారీ.. 183 టీ20ల్లో 3,436 పరుగులు బాదారు. తివారీ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్ బాగానే సాగినా.. అంతర్జాతీయ కెరీర్ మాత్రం గొప్పగా సాగలేదు. 15 మ్యాచులతోనే కెరీర్ ముగించారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేబినెట్‌లో క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా మనోజ్‌ తివారీ నియమితులయ్యారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో పునరాగమనం చేసిన తివారీ.. బెంగాల్‌ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో బెంగాల్‌ ఓడిపోయింది. మంత్రి తివారీకి అదే చివరి మ్యాచ్‌.

Also Read: TS MBBS Web Options 2023: నేటి నుంచే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు!

Show comments