ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ 3-1తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీలు కూడా గంభీర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించాడు. గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదన్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్నపుడు భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు మనోజ్ తివారీ గుర్తు చేసుకున్నాడు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ… ‘నేను గౌతమ్ గంభీర్‌ను హిపోక్రైట్ అని పిలుస్తా. ఎందుకంటే.. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అయన మాట్లాడిన మాటలే అందుకు కారణం. విదేశాల నుంచి వచ్చే కోచ్‌లకు భావోద్వేగాలు ఉండవు, అనుభూతులు ఉండవు, డబ్బు సంపాదించుకోవడానికి భారత్ వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్తారని గంభీర్ అన్నాడు. ఇప్పుడు ఆతడే హెడ్ కోచ్‌గా ఉన్నాడు కదా.. భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా?. ఆలా చేయకుండా రైన్ టెన్ డస్కెటే, మోర్నీ మోర్కెల్‌ను తీసుకున్నాడు. గంభీర్ చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. అందుకే అతడిని హిపోక్రైట్ అంటాను’ అని వివరించాడు.
Also Read: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
‘గంభీర్ హద కోచ్‌గా సాధించిన ఫలితాలను అందరూ చూస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ టెస్టుల్లో భారత్ ఓడింది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లను కోల్పోయాం. ఆసీస్‌పై ఆడిన జట్టులో ఎక్కువగా కుర్రాళ్లు ఉన్నారు, స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు కాబట్టి ఓకే. స్వదేశంలో కివీస్‌పై సిరీస్ ఓడిపోవడం ఆమోదయోగ్యం కాదు. క్రికెట్‌లో గెలుపోటములు సహజం కానీ.. ఓడినప్పుడు ఏం జరిగిందనే దానిపై సమీక్షించుకోవాలి. రాహుల్ ద్రవిడ్ విజయ పరంపరను ముందుకుతీసుకెళ్లాల్సిన గంభీర్.. వెనక్కి మళ్లిస్తున్నట్లు అనిపిస్తోంది. కోచింగ్‌లో అనుభవం లేకపోవడమే ఇందుకు దీనికి కారణం. గంభీర్‌కు కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లేదా ఐపీఎల్‌లో కోచ్‌గా అనుభవం లేదు. జట్టుకు మెంటార్‌గా ఉండటం, కోచ్‌గా ఉండటం చాలా భిన్నం. అనుభవం లేనప్పుడు అతడి నుంచి మనం ఫలితం ఎలా ఆశిస్తాం. గంభీర్ తన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. లేకపోతే ఎక్కువకాలం కొనసాగడం కష్టమే’ అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.