Joram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మనోజ్ బాజ్‌పేయ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘జోరమ్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయీ నటించిన ‘జోరమ్’ మూవీ డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది . పలు అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించారు.ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టిన ఈ మూవీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199 రెంట్‌తో అందుబాటులోకి ఉంది. అంటే ఈ చిత్రం చూడాలంటే ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంతకాలం తర్వాత సబ్స్క్రైబర్లందరూ ఉచితంగా చూసేందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రంలో వలస కార్మికుడిగా మనోజ్ బాజ్పేయీ అద్భుతంగా నటించారు. హత్య చేయాలనుకునే వారి నుంచి తన పసిబిడ్డను రక్షించుకునేందుకు పలు సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
జోరమ్ మూవీలో మహమ్మద్ జీషమ్ అయుబ్, స్మిత తాంబే, మేఘా మాథుర్, తనిష్ట చటర్జీ, రాజ్శ్రీ దేశ్‌పాండే మరియు అపూర్వ డోంగర్వల్ కీలకపాత్రలు పోషించారు. దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించిన ఈ మూవీకి మగేశ్ దక్డే సంగీతం అందించారు. జీ స్టూడియోస్ మరియు మఖీజా ఫిల్మ్స్ పతాకంపై షరీక్ పటేల్, అషిమా అవస్థి చౌదరీ, అనుపమ బోస్ మరియు దేవాన్శిశ్ మఖీజా నిర్మించారు.జోరమ్ మూవీ 2023లో రెటెర్‌డామ్ (నెదర్లాండ్స్)లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. 70వ సిడ్నీ ఫిల్మ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ మరియు 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్టాండిగ్ ఓవియేషన్ దక్కింది. ఆస్కార్ లైబ్రరీలోనూ పర్మినెంట్ కోర్ కలెక్షన్లలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది.అలాగే ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ జోరమ్ మూవీకి మంచి గుర్తింపు దక్కింది. క్రిటిక్స్ ఉత్తమ సినిమా మరియు ఉత్తమ కథ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..