Site icon NTV Telugu

ManiRatnam : మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి జోడిగా సాయి పల్లవి

Maniratnam

Maniratnam

తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు.

Also Read : UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్

 ప్రముఖ దర్శకుడు మణిరత్నం తగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పవర్ఫుల్ కధతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.  సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్‌ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అలాగే మణిరత్నం కు చెందిన మద్రాస్ టాకీస్ సంయక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టీఆర్ శింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల STR ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పడంతో అదే కథకు విజయ్ సేతుపతితో చేస్తున్నారు మణిరత్నం. నేడు అఫీషియల్ గా ప్రకటించిన ఈ సినిమాను ఆస్కార్ విన్నెర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version