Manipur Case: మణిపూర్ జరిగిన దారుణ ఘటన పై దేశమంతా స్పందించింది. ఘటనకు సంబంధించి వీధి నుంచి అత్యున్నత సభ వరకు పోరాటం సాగుతోంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మణిపూర్ ప్రభుత్వం, సీఎం ఎన్ బీరెన్ సింగ్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. మహిళల పట్ల క్రూరత్వానికి పాల్పడిన కేసులో ఇప్పటివరకు కేవలం 4 మంది నిందితులను మాత్రమే అరెస్టు చేశారు, దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివాదాలు పెరిగి ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మణిపూర్‌లో మహిళలపై జరిగిన దాడికి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన చాలా సిగ్గుచేటు, దేశం సిగ్గుతో తలదించుకునేలా ఉంది.
Read Also:Earthquake in Jaipur: జైపూర్లో భూకంపం.. ఒక్క గంటల్లో మూడుసార్లు కంపించిన భూమి
మణిపూర్‌లో హింస నిరంతరం జరుగుతోందని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు సమయం పట్టింది. వీడియో అందిన వెంటనే చర్యలు తీసుకున్నారు. మణిపూర్ సమస్యపై రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు పోరాటం చేస్తున్నారు. ఇది చాలా అనాగరికమని, అలాంటి వారికి కఠినంగా శిక్షపడాలని మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే అన్నారు.
Read Also:Project K: ‘కల్కి’ గా దిగిన ప్రభాస్… హాలీవుడ్ రేంజ్ లో ఫస్ట్ గ్లింప్స్..
ఇది ఇలా ఉంటే మే 4వ తేదీన మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు జరగగా, 77 రోజుల తర్వాత చర్యలు తీసుకున్నారు. అది కూడా ఆ దారుణానికి సంబంధించిన వీడియో యావత్ ప్రపంచం ముందుకు వచ్చిన తర్వాతే. ప్రధాన నిందితుడు సహా నలుగురిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. అందుకే పోలీసుల పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది. రెండున్నర నెలలుగా అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. మహిళల భద్రత ప్రశ్న, చర్యలో జాప్యం, న్యాయం ఈ ప్రశ్నల మధ్యే మణిపూర్ గవర్నర్ డీజీపీని పిలిపించి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అత్యాచారానికి పాల్పడిన నిందితులందరినీ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు గవర్నర్ అనసూయ ఉకే తెలిపారు. మరి మే 4న ఈ ఘటన జరిగి 18న నివేదిక ఇచ్చిన పోలీస్ స్టేషన్‌లో ఇప్పటి వరకు పోలీసులు విచారణ చేసి నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? ఇది చాలా బాధాకరం.