NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం!

Manipur Violence

Manipur Violence

Manipur Violence Latest Updates: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు ముందు జరిగాయని, ఆ తర్వాత తుపాకుల కాల్పులు జరిగాయని తెలిపారు. అల్లం కోయడానికి వెళ్లిన వారి ఆచూకీ తెలియకపోవడంతో కుంబి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. గల్లతైంన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గల్లంతైన నలుగురిని దారా సింగ్, ఇబోమ్చా సింగ్, రోమెన్ సింగ్, ఆనంద్ సింగ్‌లుగా గుర్తించారు. వారు తీవ్రవాదుల వద్ద బందీలుగా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Bull In Bank: ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు.. వీడియో వైరల్!

గతేడాది మే 3 నుంచి మణిపూర్‌ జాతి హింసతో అట్టుడుకుతోంది. మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అ‍ప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. 2024 జనవరి 1న తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. ఆ మరుసటి రోజు గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్‌లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show comments