Manipur Violence: మణిపూర్ మైతే కమ్యూనిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన కాథలిక్ బిషప్ కౌన్సిల్ అధ్యక్షుడు కార్డినల్ మార్ బసేలియోస్ క్లీమీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘క్రిస్టియానిటిని భారత దేశం నుంచి తుడిచిపెట్టగమని ఎవరూ అనుకోకూడదు’ అని అన్నారు. హింసాత్మక మణిపూర్‌లో తక్షణమే శాంతిని పునరుద్ధరించడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, క్లీమిస్ ఈ సమస్యపై మౌనం వీడాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుప్జాలో మణిపూర్ సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్ నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సైరో-మలంకర కాథలిక్ చర్చి ఆర్చ్ బిషప్ క్లీమిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలి.. ఈ దేశ సమగ్రతను ప్రపంచానికి పంచాలి.. భారత్‌లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదే అత్యుత్తమ అవకాశం అని చెప్పారు. మన రాజ్యాంగంలోని లౌకికవాదం అనే పదం కేవలం అలంకారప్రాయమైనది కాదని.. ఇది అమలులో ఉన్న తత్వశాస్త్రం అని.. ఏ మతాన్ని అయినా ఆచరించే, అనుసరించే హక్కును కల్పించే మన గొప్ప రాజ్యాంగం ఎందుకు దాచబడింది..? కేంద్రం మౌనం వీడి మణిపూర్ శాంతికి జోక్యం చేసుకోవాలని క్లీమీస్ కోరారు.
Read Also: Ileyana : తొమ్మిదో నెల గర్భంతో ఇబ్బంది పడుతున్న ఇలియానా..
మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగి నేటికి 65 రోజులు కావస్తున్నా.. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెబుతున్న ప్రభుత్వం అల్లర్లను ఎందుకు అదుపు చేయలేకపోతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేరళలోని క్రైస్తవ బిషప్‌లు, వివిధ డియోసెస్‌లు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మైయిటీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తూ కుకీ, నాగా గిరిజనులు పెద్ద ఎత్తున మే 3న ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో తీవ్ర హింస చెలరేగింది. అప్పటి నుంచి మణిపూర్ రావణకాష్టంగా రగులుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ హింసలో 100 మందికి పైగా చనిపోయారు. దీనికి తోడు ఈ ఘర్షణల్లో మిలిటెంట్లు కలుగజేసుకుని సమస్యను మరింత పెద్దదిగా చేస్తున్నారు. ఇరు వర్గాలకు చెందిన మిలిటెంట్లు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే మణిపూర్ లో సైన్యం, పారామిలిటరీ మోహరించి పరిస్థితిని చక్కదిద్దే పనిచేస్తోంది.