Site icon NTV Telugu

Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. ఆ జిల్లాలో కర్ఫ్యూ..

Manipur Violence

Manipur Violence

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శనివారం అనేక జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించారు. శనివారం రాత్రి మెయిటీ సంస్థ నాయకుడు అరంబై టెంగోల్, అనేక మంది ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హింస చెలరేగింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

READ MORE: Housefull-5 : మాస్క్‌లో వచ్చి తన సినిమా రివ్వూ అడుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్

నిరసనకారులు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిలో చాలా మంది నిరసనకారులు నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అరంబాయి టెంగోల్ అరెస్టు తర్వాత.. శనివారం రాత్రి ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కూడా భారీ నిరసనలు చెలరేగాయి. రాజధాని ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇంఫాల్‌లోని ఖురాయ్ లామ్‌లాంగ్ ప్రాంతంలో, కోపంతో ఉన్న నిరసనకారులు బస్సులను తగలబెట్టారు. టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. నిరసనకారులు ఇక్కడితో ఆగలేదు. ఇంఫాల్ విమానాశ్రయంలోని తులిహాల్ గేటు వెలుపల గుమిగూడారు. ఆందోళనకారులు రాత్రిపూట విమానాశ్రయ రోడ్డులో ట్రాఫిక్‌ను అడ్డుకుని, రాత్రంతా అక్కడే నిద్రపోయారు.రాజధానిలో పెరుగుతున్న హింసను చూసి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం.

READ MORE: Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

Exit mobile version