No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్ సర్కారు కొత్త నిబంధన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించాలని మణిపుర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పరిపాలన శాఖకు ఉత్తర్వులు అందాయి. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆ శాఖ కార్యదర్శి మిఖాయేల్ అచోమ్ తెలిపారు. రాష్ట్ర పరిపాలనా శాఖ నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే.. వారి జీతంలో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పరిపాలన శాఖ కార్యదర్శి మిఖాయేల్ అచోమ్ వెల్లడించారు. జూన్ 12న సీఎం బీరేన్ సింగ్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు.
Also Read: Integrated BEd: 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్
Also Read
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాని, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న హింస కారణంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిబంధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనేది వెల్లడించలేదు.
మణిపూర్ ప్రభుత్వంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది విధులకు హాజరుకాలేదు. అధికారుల ప్రకారం, మణిపూర్‌లో నిరాశ్రయులైన 65,000 మందిలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింస కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. తమ ఉద్యోగులకు “నో వర్క్, నో పే” నిబంధనను తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కుకీ తెగల అత్యున్నత సంస్థ కుకి ఇన్పి మణిపూర్ (KIM) తీవ్రంగా వ్యతిరేకించింది. మణిపూర్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలను, ముఖ్యంగా ఇంఫాల్ లోయ నుంచి పారిపోయిన వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని KIM జనరల్ సెక్రటరీ ఖైఖోహాహు గాంగ్టే అన్నారు.
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రత్యేకంగా అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిక సమర్పించారు. మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్ షా హామీ ఇచ్చారని భేటీ అనంతరం సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని మంగళవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
తాజావార్తలు
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!