NTV Telugu Site icon

Biren Singh: మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం..

Manipur Cm

Manipur Cm

Manipur: మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. అయితే, మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని సీఎం బీరెన్ సింగ్ చెప్పారు.

Read Also: JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాలు.. 10 మంది తెలుగు విద్యార్థులకు 100 శాతం స్కోరు!

కాగా, ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్‌, ముఖ్యంగా మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులు కారణమని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం.. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది అని ప్రకటించారు. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ముందుకు నడుస్తుంది.. భారత్‌- మయన్మార్‌ మధ్య ఫ్రీ మూమెంట్‌ రిజైమ్‌(ఎఫ్‌ఎమ్‌ఆర్‌)ఇక ఉండబోదు.. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తామన్నారు. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు అని మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్‌ వెల్లడించారు.

Show comments