Manipur: బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్‌లో ఎన్‌డీఏ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) మద్దతు ఉపసంహరించుకుంది. కుకీ పీపుల్స్ అలయన్స్(కేపీఏ) అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాశారు. బీజేపీతో బంధాన్ని తెంచుకోవాలనే పార్టీ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేశారు. గత మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రాన్ని పీడిస్తున్న జాతి హింస ఫలితంగా 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Explosion: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. కార్మికుడు దుర్మరణం
ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వానికి నిరంతర మద్దతు నిరుపయోగమని హౌకిప్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను కలిగి ఉన్న కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) గవర్నర్ అనుసూయా ఉయికీకి రాసిన లేఖలో తమ మద్దతు ఉపసంహరణను ప్రకటించింది. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదు.