True Lover Movie Streaming on Disney+ Hotstar: జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో నటుడు కె.మణికందన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గుడ్‌నైట్ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. మణికందన్ తాజాగా ‘లవర్’ సినిమా చేశాడు. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గౌరీ ప్రియ కథానాయికగా నటించారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల అయింది. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన లవర్.. తెలుగులో (ట్రూ లవర్) పెద్దగా ఆడలేదు. కంటెంట్ బాగున్నా.. అదే టైంలో ‘ఈగల్’, ‘లాల్ సలామ్’ సినిమాలు రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది.
ట్రూ లవర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు శుభవార్త. ఈ సినిమా ఆఫీషియల్ ఓటీటీ డేట్ వచ్చేసింది. మార్చి 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ట్రూ లవర్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. థియేటర్‌లో చూడని వారు ఎంచక్కా.. ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో టాలీవుడ్ యువ హీరో!
కథేంటంటే.. అరుణ్ (మణికందన్), దివ్య (గౌరీ ప్రియ) కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు. కాలేజీ పూర్తి కాగానే ఓ మంచి కంపెనీలో దివ్యకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ.. ఖాళీగా తిరుగుతాడు. దివ్యపై తరచూ అనుమాన పడుతుంటాడు. దాంతో ఇద్దరు తరచూ గొడవపడుతూ విడిపోయి.. మళ్లీ కలిసిపోతుంటారు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య ఓ దశలో అతని నుంచి పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత దివ్య తన ఆఫీస్ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కు వెళ్తుంది. అది తెలిసి అక్కడికి అరుణ్ కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? వీళ్లిద్దరు మళ్లీ కలిశారా? విడిపోయారా?.. అరుణ్ వాళ్ల అమ్మ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమేంటి?.. కేఫ్ పెట్టాలన్న లక్ష్యం నెరవేరిందా? అన్నది మిగతా కథ.