NTV Telugu Site icon

Venki Atluri : షూటింగ్ అంతా ఒకే టీ షర్టు, ఒకే ప్యాంటు.. డైరెక్టర్ ను చూస్తే బాధేసింది

New Project 2024 11 04t072544.719

New Project 2024 11 04t072544.719

Venki Atluri : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన దర్శకత్వ ప్రతిభతో మంచి పేరును సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్లలో వెంకీ అట్లూరి ఒకడు. నటుడిగా, రైటర్‌గా చాన్నాళ్ల క్రితమే టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపించిన ఆయన.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలి ప్రేమ’ మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ‘తొలి ప్రేమ’ తర్వాత వెంకీ అట్లూరి పలు చిత్రాలను రూపొందించినా అవి బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ‘సార్’ అనే సినిమా తీశాడు. ఇది తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఊపులోనే ఇప్పుడు వెంకీ అట్లూరి.. దుల్కర్ సల్మాన్ హీరోగా ‘లక్కీ భాస్కర్’ సినిమాను రూపొందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఇది అక్టోబర్ 31న విడుదల అయింది.

Read Also:Khalistanis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ఖండించిన ట్రూడో

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సాగుతోంది. ఇలా ఇది వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించే అవకాశం ఉందని బాక్సాఫీసు వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. దీనికి హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరితో పాటు ఇందులో పని చేసిన యాక్టర్లు, టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటుడు మాణిక్ రెడ్డి.. దర్శకుడు వెంకీ అట్లూరి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన పై జాలి చూపించాడు.

Read Also:CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌

సక్సెస్ మీట్లో మాణిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా డైరెక్టర్ వెంకీ అట్లూరిని చూస్తే బాధేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక్కటే టీ షర్ట్, ఒక్కటే ప్యాంట్‌తో కనిపించే వాడు. ఆయనను అలా చూసి చూసి విసిగిపోయి నేనే ఆయనకు ఒక జత బట్టలు కొనివ్వాలని అనుకున్నాను. కానీ, మరోవైపు ఆయనకు అది సెంటిమెంట్ ఏమో అని ఊరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ మీట్‌లో మాణిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వాళ్లంతా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకుల్లా వెంకీ అట్లూరి కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments