Venki Atluri : షూటింగ్ అంతా ఒకే టీ షర్టు, ఒకే ప్యాంటు.. డైరెక్టర్ ను చూస్తే బాధేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venki Atluri : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన దర్శకత్వ ప్రతిభతో మంచి పేరును సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్లలో వెంకీ అట్లూరి ఒకడు. నటుడిగా, రైటర్‌గా చాన్నాళ్ల క్రితమే టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపించిన ఆయన.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలి ప్రేమ’ మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ‘తొలి ప్రేమ’ తర్వాత వెంకీ అట్లూరి పలు చిత్రాలను రూపొందించినా అవి బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ‘సార్’ అనే సినిమా తీశాడు. ఇది తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఊపులోనే ఇప్పుడు వెంకీ అట్లూరి.. దుల్కర్ సల్మాన్ హీరోగా ‘లక్కీ భాస్కర్’ సినిమాను రూపొందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఇది అక్టోబర్ 31న విడుదల అయింది.
Read Also:Khalistanis Attacked Hindus: కెనడాలో హిందూ భక్తులపై ఖలిస్తానీల దాడి.. ఖండించిన ట్రూడో
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సాగుతోంది. ఇలా ఇది వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించే అవకాశం ఉందని బాక్సాఫీసు వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. దీనికి హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరితో పాటు ఇందులో పని చేసిన యాక్టర్లు, టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటుడు మాణిక్ రెడ్డి.. దర్శకుడు వెంకీ అట్లూరి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన పై జాలి చూపించాడు.
Read Also:CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
సక్సెస్ మీట్లో మాణిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా డైరెక్టర్ వెంకీ అట్లూరిని చూస్తే బాధేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక్కటే టీ షర్ట్, ఒక్కటే ప్యాంట్‌తో కనిపించే వాడు. ఆయనను అలా చూసి చూసి విసిగిపోయి నేనే ఆయనకు ఒక జత బట్టలు కొనివ్వాలని అనుకున్నాను. కానీ, మరోవైపు ఆయనకు అది సెంటిమెంట్ ఏమో అని ఊరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ మీట్లో మాణిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వాళ్లంతా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకుల్లా వెంకీ అట్లూరి కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?