ములుగు జిల్లాలోని రామప్ప రామలింగేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామప్ప శిల్ప సంపద అమోఘం, అద్భుతమని కొనియాడారు. అంతేకాకుండా.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. కాకతీయుల కళా వైభవం కళ్ళకు కట్టినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ యాత్ర విజయవంతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డిపై దాడి చేస్తే జోడోయాత్ర ఆగుతుందని అనుకుంటున్నారని, కేసీఆర్ ప్రభుత్వం దాడులను నమ్ముకుని ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుని ఉందని, ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ దాడులను ఖండిస్తున్నామన్నారు థాక్రే.
Also Read : CM KCR : ‘హోన్ హై ఫాక్స్ కాన్’ కు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై, నాయకులపై భౌతిక దాడులు రోజురోజుకూ ఎక్కువ చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి జనసభ మీటింగ్ ప్రజాదరణ చూసి.. ఏదో ఒక గలాటా చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నమే పవన్ పైన దాడి అన్నారు. ఈ యాత్రలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై అతి దారుణంగా దాడి చేశారు.. ఇనుప రాడ్లతో తల మీద కొట్టిచనిపోయాడని వదిలిపెట్టి పోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికార నాయకులకు కూడా తెలుసు ఆ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదన్నారు.
Also Read : Allu Arjun: అయ్యిందా.. బాగా అయ్యిందా.. అది రూమర్ అని తెలిసిందా..?