NTV Telugu Site icon

Dulam Nageswara Rao: సీఎం జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చాలా బాగుంది..

Dulam

Dulam

ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం ముడతలపాడులో ప్రజా ఆశీర్వాద యాత్రను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చాలా బాగుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అనగానే జగనన్న రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రిలీజ్ చేశారన్నారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నుంచి అందరు నాయకులు వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తే జగన్ చెప్పిందే చేస్తాడు అనే విధంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వెల్లడించారు.

Read Also: Water Crisis: దక్షిణ భారతదేశంలో నీటి ఎద్దడి.. బెంగళూరుతో పాటు ఈ రాష్ట్రాల్లోనూ..

కాగా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగనన్నపై నమ్మకం ఏర్పరచుకున్నారు అని కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చెప్పారు. మన జగనన్న పేద ప్రజల అభ్యున్నతికి, చదువు నిమిత్తం, విద్యా దీవెన, పెన్షన్ పెంపుదల, అమ్మ ఒడి పెంపుదల, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా 25 లక్షల రూపాయలకు పెంచిన పథకం, ప్రతి కుటుంబానికి కూడా నేనున్నానని భరోసా ఇవ్వటం, 66 లక్షల పెన్షన్లు ఇవ్వడం కానీ, దేశ చరిత్రలోనే ఇన్నీ పథకాలు అమలు చేసిన రాష్ట్రం బహుశా ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని దూలం నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.