NTV Telugu Site icon

Mango Cultivation : మామిడి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Mango Market

Mango Market

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పండ్ల లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది.. మార్కెట్ లో సమ్మర్ లో మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది.. కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు జిల్లాల్లో మామిడిని ఎక్కువగా పండిస్తున్నారు.. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తుంది..

ఇకపోతే రైతులు అధిక దిగుబడితో పంటను పండించిన కోతల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాయల నాణ్యత తగ్గి ధర కూడా తగ్గిపోతుంది.. దాంతో నష్టాలను చూస్తున్నారు.. కోతల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందుతారు.. కోసిన మామిడి కాయలను ఒక చోట నీడలో ఆరబోయాలి..దానిలో పిందెలు, వ్యాధి సోకిన మరియు కుళ్ళిన వాటిని వేరు చేయాలి. వేరు చేసిన తరువాత పండ్ల ఆకారం, పరిమాణం, రంగు, బరువును బట్టి యాంత్రికంగా గాని, మనుషుల చేతగాని వేరు చేయాలి.చాలా దేశాలు కొన్ని స్వంత స్టాండర్డ్ లను కలిగి ఉండి వాటిని బట్టి గ్రేడింగ్ చేసి లోకల్ మార్కెట్కు గాని విదేశీ మార్కెటికి గాని పంపించి అమ్మకం చేస్తారు..

గ్రేడింగ్ తరువాత పండ్లను ఆకులు, కొమ్మలు మొదలగు వాటిలో కప్పివేసి తూకం వేసి చిన్న చిన్నగా ప్యాక్ చేస్తారు. తరువాత ఈ చిన్న, చిన్న ప్యాకెట్లను పెద్ద గోనె సంచులో గాని, ఊలుతో తయారైన సంచిలలో గాని, వెదురు బుట్టలో గాని, గడ్డి బుట్ట, తాటిబుట్టలు, చెక్క పెట్టెలు,ప్లాస్టిక్ పెట్టేలలో వీటిని ఫ్యాక్ చెయ్యాలి.. రవాణా చేసినప్పుడు కాయన నలగకుండా ఉంటాయి.. రైలు రవాణా కంటె రోడ్డు రవాణా ఉత్తమం.లోకల్ గా ఉన్న మార్కెట్లకు ఎడ్లబండి, ట్రాక్టర్, ట్రక్కులు, ట్రాలీలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి వాటిని తరలించాలి.. అప్పుడే ఎటువంటి నష్టం కలగకుండా మంచి లాభాలను పొందవచ్చు..