Mango Cultivation : మామిడి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పండ్ల లో మామిడి ఎక్కువగా సాగు అవుతుంది.. మార్కెట్ లో సమ్మర్ లో మామిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది.. కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు జిల్లాల్లో మామిడిని ఎక్కువగా పండిస్తున్నారు.. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తుంది..
ఇకపోతే రైతులు అధిక దిగుబడితో పంటను పండించిన కోతల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాయల నాణ్యత తగ్గి ధర కూడా తగ్గిపోతుంది.. దాంతో నష్టాలను చూస్తున్నారు.. కోతల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలను పొందుతారు.. కోసిన మామిడి కాయలను ఒక చోట నీడలో ఆరబోయాలి..దానిలో పిందెలు, వ్యాధి సోకిన మరియు కుళ్ళిన వాటిని వేరు చేయాలి. వేరు చేసిన తరువాత పండ్ల ఆకారం, పరిమాణం, రంగు, బరువును బట్టి యాంత్రికంగా గాని, మనుషుల చేతగాని వేరు చేయాలి.చాలా దేశాలు కొన్ని స్వంత స్టాండర్డ్ లను కలిగి ఉండి వాటిని బట్టి గ్రేడింగ్ చేసి లోకల్ మార్కెట్కు గాని విదేశీ మార్కెటికి గాని పంపించి అమ్మకం చేస్తారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
గ్రేడింగ్ తరువాత పండ్లను ఆకులు, కొమ్మలు మొదలగు వాటిలో కప్పివేసి తూకం వేసి చిన్న చిన్నగా ప్యాక్ చేస్తారు. తరువాత ఈ చిన్న, చిన్న ప్యాకెట్లను పెద్ద గోనె సంచులో గాని, ఊలుతో తయారైన సంచిలలో గాని, వెదురు బుట్టలో గాని, గడ్డి బుట్ట, తాటిబుట్టలు, చెక్క పెట్టెలు,ప్లాస్టిక్ పెట్టేలలో వీటిని ఫ్యాక్ చెయ్యాలి.. రవాణా చేసినప్పుడు కాయన నలగకుండా ఉంటాయి.. రైలు రవాణా కంటె రోడ్డు రవాణా ఉత్తమం.లోకల్ గా ఉన్న మార్కెట్లకు ఎడ్లబండి, ట్రాక్టర్, ట్రక్కులు, ట్రాలీలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి వాటిని తరలించాలి.. అప్పుడే ఎటువంటి నష్టం కలగకుండా మంచి లాభాలను పొందవచ్చు..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..