సమ్మర్ వస్తే వేడి మాత్రమే కాదు.. తియ్యని, నో్రూరించే మామిడి పండ్లు కూడా వస్తాయి.. ఈ సీజన్ లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. అందుకే వేసవిలో మామిడితో చేసే వంటలకు జనాలు ఫిదా అవుతున్నారు.. అలాగే ఖర్చు కూడా వాటికి ఎక్కువే.. మామిడి తాండ్రా, జ్యుస్ లు, ఐస్ క్రీమ్ లు మనం తినే ఉంటాం కానీ మ్యాంగో తో బొబ్బట్లు ఎప్పుడైనా ట్రై చేశారా.. కనీసం ఆ మాటలు అన్నా విన్నారా.. ఇదెలా ఉంటుందో.. ఏయే పదార్థాలు వాడుతారు.. ఎలా చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
మైదాపిండి – 2 కప్పులు,
ఉప్పు -చిటికెడు,
పసుపు – చిటికెడు,
తియ్యటి మామిడి పండ్లు – పెద్దవి మూడు,
శనగపిండి – పావు కప్పు,
బెల్లం తురుము – పావు కప్పు,
యాలకుల పొడి – ఒక టీ స్పూన్..
తయారీ విధానం :
ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. వాటిని చెక్కు తీసి గుజ్జును మెట్టగా చేసి పక్కన పెట్టుకోవాలి..ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత 5 లేదా 6 టీ స్పూన్ల నూనె వేసి మరో 8 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని పక్కకు ఉంచాలి.. ఆ తర్వాత నెయ్యి వేసి బాగా వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక శనగపిండిని వేసి వేయించాలి. శనగపిండిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత మామిడిపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తరువాత బెల్లం వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి.. బొబ్బట్లు ఎలా చేస్తారో అలా ముందుగా మైదా పిండిని తీసుకొని చేతులతో ఒత్తుకోవాలి..అందులో మామిడి మిశ్రమాన్ని తీసుకొని బొబ్బట్లుగా తయారు చేసిన విధంగా నెయ్యి పూస్తూ చెయ్యాలి.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి అంతే టేస్టీగా మామిడి బొబ్బట్లు రెడీ.. తియ్యగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చెయ్యండి…