పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీ 20 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోయాయి. మంగళవారం సినిమాలో ప్రియదర్శి, చైతన్య కృష్ణ మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.ఆర్ ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్‌లో మంగళవారం మూవీ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ థ్రిల్లర్‌గా అజయ్ భూపతి ఈ సినిమా కథను రాసుకున్నారు. ఈ మూవీలో ఓ సెక్సువల్ డిజార్డర్ పాయింట్‌ను టచ్ చేశారు.
మానసిక సమస్యతో బాధపడే యువతిగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ నటనకు ప్రశంసలు దక్కాయి. గ్లామర్ పాత్రలకు భిన్నంగా పాయల్ రాజ్‌పుత్‌లోని యాక్టింగ్ టాలెంట్‌ను ఈ మూవీ బయట పెట్టింది.లాంగ్ గ్యాప్ తర్వాత మంగళవారంతో పాయల్ రాజ్‌పుత్ హిట్ అందుకుంది.. అజయ్ భూపతి టేకింగ్ కి పాటు అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ కూడా తోడై సినిమా మంచి విజయం సాధించింది.అయితే ఇటీవల స్టార్‌మాలో ఈ మూవీ ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అదిరిపోయే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.మంగళవారం మూవీకి అర్బన్ ఏరియాలో 7.21 టీఆర్‌పీ రేటింగ్ రాగా…అర్బన్, రూరల్ కలిపి 6.51 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి బుల్లితెరపై అంతగా రెస్సాన్స్ రాదని టీవీ వర్గాలు అనుకున్నాయి.కానీ వారి అంచనాలను మించి టీవీల్లో ఈ సినిమా హిట్టయింది. రీసెంట్‌గా స్టార్‌లో టెలికాస్ట్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్న మూవీగా మంగళవారం నిలిచింది.
