Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mangalavaaram Thriller Movie That Has Come To Ott Streaming

Mangalavaaram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ మూవీ..

Published Date :December 26, 2023 , 4:03 pm
By Murali Krishna
Mangalavaaram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ మూవీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన  సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”.ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం సినిమాతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మంగళవారం సినిమా  ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వచ్చిన ఆ ప్లాట్‍ఫామ్ ఇటీవలే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది.

నేడు (డిసెంబర్ 26) ఎట్టకేలకు మంగళవారం చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. మంగళవారం రోజున ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.ఆర్ఎక్స్100 చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు ఆజయ్ భూపతి ఆ తర్వాత మహాసముద్రంతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చిన మంగళవారం మంచి కలెక్షన్లు సాధించింది. కథలోని విభిన్నమైన పాయింట్ మరియు అజయ్ భూపతి టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్ క్యారెక్టర్ మరియు ఆమె నటన సినిమాకే హైలైట్‍గా నిలిచాయి. ఈ చిత్రంలో నందిత శ్వేత, అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్ మరియు కృష్ణ చైతన్య ముఖ్య పాత్రలు చేశారు. అజ్‍నీశ్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేశ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #mangalavaaram
  • ott streaming
  • Payal Rajput

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions