Mangalavaaram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”.ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం సినిమాతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మంగళవారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వచ్చిన ఆ ప్లాట్‍ఫామ్ ఇటీవలే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది.
నేడు (డిసెంబర్ 26) ఎట్టకేలకు మంగళవారం చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది. మంగళవారం రోజున ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.ఆర్ఎక్స్100 చిత్రంతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు ఆజయ్ భూపతి ఆ తర్వాత మహాసముద్రంతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చిన మంగళవారం మంచి కలెక్షన్లు సాధించింది. కథలోని విభిన్నమైన పాయింట్ మరియు అజయ్ భూపతి టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్ క్యారెక్టర్ మరియు ఆమె నటన సినిమాకే హైలైట్‍గా నిలిచాయి. ఈ చిత్రంలో నందిత శ్వేత, అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్ మరియు కృష్ణ చైతన్య ముఖ్య పాత్రలు చేశారు. అజ్‍నీశ్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేశ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?