NTV Telugu Site icon

Bachelors Padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు

Bachelors Padayatra

Bachelors Padayatra

Bachelors Padayatra: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న యువకులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్లు దాటినా సుమారు 200 మంది పెళ్లి కాని ప్రసాదులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమై 25న దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక, దీనికి బ్రహ్మచారుల పాదయాత్ర అని పేరు కూడా పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికేలా దీవించాలని అక్కడి దేవతకు మొక్కులు చెల్లించనున్నారు. మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే యువతకు వధువు దొరకడం లేదు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వాదం పొందడమే ఈ యాత్ర ఉద్దేశమని వారు వెల్లడించారు ఆ పెళ్లి కానీ ప్రసాద్‌లు.

Cloth Planning: వారంలో ఏయే రోజుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి?

గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని.. అందుకే ఇప్పుడు యువకులు అమ్మాయిలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు పేర్కొంది. కాగా పెళ్లి కోసం చేస్తున్న ఈ పాదయాత్ర దేశంలోనే తొలిసారని, చరిత్రలో ఎక్కే సంఘటన అని ఇతర ప్రాంతాల వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పాదయాత్రలో 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులంతా పాల్గొననున్నారు. ఈ యాత్రను ప్రకటించి పది రోజుల్లోనే సుమారు 100 మంది దాక పెళ్లికాని యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. యాత్రికులకు భోజన వసతి కూడా కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ యువకుల పరిస్థితి చూస్తే జాలేస్తుంది కదూ. మనమేం చేస్తాం.. అంతా కాలం చేతిలో ఉంది.

Show comments