Bachelors Padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bachelors Padayatra: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న యువకులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్లు దాటినా సుమారు 200 మంది పెళ్లి కాని ప్రసాదులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమై 25న దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక, దీనికి బ్రహ్మచారుల పాదయాత్ర అని పేరు కూడా పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికేలా దీవించాలని అక్కడి దేవతకు మొక్కులు చెల్లించనున్నారు. మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే యువతకు వధువు దొరకడం లేదు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వాదం పొందడమే ఈ యాత్ర ఉద్దేశమని వారు వెల్లడించారు ఆ పెళ్లి కానీ ప్రసాద్‌లు.
Cloth Planning: వారంలో ఏయే రోజుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి?
Also Read
గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని.. అందుకే ఇప్పుడు యువకులు అమ్మాయిలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు పేర్కొంది. కాగా పెళ్లి కోసం చేస్తున్న ఈ పాదయాత్ర దేశంలోనే తొలిసారని, చరిత్రలో ఎక్కే సంఘటన అని ఇతర ప్రాంతాల వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పాదయాత్రలో 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులంతా పాల్గొననున్నారు. ఈ యాత్రను ప్రకటించి పది రోజుల్లోనే సుమారు 100 మంది దాక పెళ్లికాని యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. యాత్రికులకు భోజన వసతి కూడా కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ యువకుల పరిస్థితి చూస్తే జాలేస్తుంది కదూ. మనమేం చేస్తాం.. అంతా కాలం చేతిలో ఉంది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!