NTV Telugu Site icon

Manda Krishna Madiga : ముప్పై ఏళ్ల నుంచి పోరాడుతున్న.. అక్కున చేర్చుకుని మోడీ మాటిచ్చారు

New Project (9)

New Project (9)

Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అగ్ర నేతలంతా ఆఖరి అస్త్రాలను ఓటర్ల పై ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి ఓటు వేయాలంటూ మందకృష్ణ మాదిగ ప్రజలను కోరారు. గత అరవై ఏళ్ల నుండి రాష్ట్రాన్ని రెడ్డి, వెలమలే పాలిస్తున్నారు. రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి రెడ్డి.. లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్డినే అన్నారు. దేశంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 70 శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓసీ దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా బ్రాహ్మణులే కొనసాగారన్నారు.

Read Also:JioPhone Prima 4G Plans: జియోఫోన్‌ ప్రైమాకు ప్రత్యేక ప్లాన్‌లు.. అన్నింటిలో డేటా ప్రయోజాలు!

బీజేపీ ద్వారానే ఒక బీసీ బిడ్డకు ప్రధాని అయ్యే అవకాశం కలిగిందన్నారు. బీసీ ప్రధాని వల్లే రాష్ట్రపతిగా ఒక దళితురాలికి అవకాశం వచ్చిందన్నారు. దీన్నిబట్టే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయలేకపోయింది. గత 30 సంవత్సరాల నుండి వర్గీకరణ కొరకు ఉద్యమం చేస్తున్న నన్ను అక్కున చేర్చుకొని వర్గీకరణ చేస్తానని ప్రధాని మోడీ మాటిచ్చారన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణలో మాట తప్పరని హామీ ఇస్తున్నానని మందకృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాదిగలను అణచివేస్తా.. భవిష్యత్తులో కూడా అణచివేస్తానంటూ చేసిన వ్యాఖ్యలను మాదిగలు గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీని ఆదరించి గెలిపిస్తే రాబోయే బీసీ సీఎం నుంచి వర్గీకరణ సాధ్యమైతుందన్నారు.

Read Also:CPI Narayana: బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు నిద్రపోయారా..? ఎన్నికలు అయ్యాక కవితను అరెస్ట్ చేస్తారా!