NTV Telugu Site icon

Manchu Vishnu : కన్నప్పలో ప్రభాస్ రోల్ పై హింట్ ఇచ్చిన మంచు విష్ణు..

Whatsapp Image 2024 01 15 At 10.25.58 Pm

Whatsapp Image 2024 01 15 At 10.25.58 Pm

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప మూవీ ఇప్పుడు టాలీవుడ్‌ లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా మారింది. మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు..బడ్జెట్‌ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతో భారీగా గ్రాండ్ గా వుండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. చిత్రం లో క్యాస్టింగ్‌ విషయంలో అలాగే వీఎఫ్ఎక్స్ విషయం లో ఎక్కడా కంప్రమైజ్‌ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లో కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్‌ ను ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా లో ప్రభాస్‌ పాత్ర గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్‌ లోనే కాదు నార్త్‌ ఆడియన్స్‌ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని మంచు విష్ణు తెలిపారు..

ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని..త్వరలోనే మిగతా పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే కన్నప్ప గ్లింప్స్‌ ను కూడా విడుదల చేస్తామని మంచు విష్ణు తెలిపారు. అంతేకాదు ప్రభాస్‌ రోల్‌ గురించి కూడా చిన్న హింట్‌ ఇచ్చారు. ఈ సినిమా లో ప్రభాస్‌ రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే అంత థ్రిల్‌ ఉండదని.. సమయం వచ్చినప్పుడు ఆ విషయం తానే వెల్లడిస్తానని తెలిపారు.మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలని.. మిగిలిన షూటింగ్‌ కూడా అక్కడే కంప్లీట్‌ చేస్తామని విష్ణు తెలిపారు.. అంతేకాదు ఈ సినిమా లో తన తండ్రి మోహన్‌బాబు తో పాటు తన కొడుకు అవ్రామ్‌ కూడా నటిస్తున్నట్లు విష్ణు చెప్పుకొచ్చారు.