Manchu Vishnu : కన్నప్పలో ప్రభాస్ రోల్ పై హింట్ ఇచ్చిన మంచు విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన కన్నప్ప మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. మంచు విష్ణు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు..బడ్జెట్ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎంతో భారీగా గ్రాండ్ గా వుండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. చిత్రం లో క్యాస్టింగ్ విషయంలో అలాగే వీఎఫ్ఎక్స్ విషయం లో ఎక్కడా కంప్రమైజ్ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం లో కన్నప్ప మూవీ గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్ ను ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా లో ప్రభాస్ పాత్ర గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్ లోనే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని మంచు విష్ణు తెలిపారు..
ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని..త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే కన్నప్ప గ్లింప్స్ ను కూడా విడుదల చేస్తామని మంచు విష్ణు తెలిపారు. అంతేకాదు ప్రభాస్ రోల్ గురించి కూడా చిన్న హింట్ ఇచ్చారు. ఈ సినిమా లో ప్రభాస్ రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే అంత థ్రిల్ ఉండదని.. సమయం వచ్చినప్పుడు ఆ విషయం తానే వెల్లడిస్తానని తెలిపారు.మరో నెలలో న్యూజిలాండ్ వెళ్లాలని.. మిగిలిన షూటింగ్ కూడా అక్కడే కంప్లీట్ చేస్తామని విష్ణు తెలిపారు.. అంతేకాదు ఈ సినిమా లో తన తండ్రి మోహన్‌బాబు తో పాటు తన కొడుకు అవ్రామ్ కూడా నటిస్తున్నట్లు విష్ణు చెప్పుకొచ్చారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!