టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమానే “మిరయ్” ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.ఆ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నారు అని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు.
ప్రస్తుతం “మిరయ్” సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఇదిలా ఉంటే మిరయ్ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ అనే డేంజరస్ కత్తితో యుద్దాలు చేస్తున్నట్టు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ గ్లింప్స్ వీడియోను మేకర్స్ డిజైన్ చేసారు . ఈ గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.