Site icon NTV Telugu

David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో రాశి ఖన్నా

David Reddy

David Reddy

మంచు మనోజ్ హీరోగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఒక వీరోచిత గాథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంతా బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ‘వార్ డాగ్’ అనే బైక్ నిలవనుంది. సుమారు 700 కేజీల బరువుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బైక్ మనోజ్ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేయబోతోంది. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హిట్ మూవీ ‘ప్రిన్స్’ ఫేమ్ మరియా కథానాయికగా నటిస్తోంది. అయితే

Also Read : Sara Arjun: లైలా మజ్ను సీక్వెల్‌లో హీరోయిన్‌గా ‘ధురంధర్’ భామ..

ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ (Special Song) ప్లాన్ చేసినట్లు, అందులో మనోజ్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి టాలెంటెడ్ బ్యూటీ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక పక్క పవర్ ఫుల్ పీరియాడిక్ కథను చెబుతూనే, ఈ సినిమా కథ మరోపక్క రాశి ఖన్నా స్పెషల్ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మనోజ్ నుంచి వస్తున్న ఈ మాస్ బొమ్మపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version