Site icon NTV Telugu

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..

David Reddy

David Reddy

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ అనే పాన్-ఇండియా చిత్రంతో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా నటిస్తున్నారు. ‘ప్రిన్స్’ చిత్రంతో తమిళంలో పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మనోజ్ ఫిరోషియస్ వారియర్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

READ ALSO: Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..

బ్రిటిష్ కాలం నేపథ్యంలో..1897 నుంచి 1922 వరకు బ్రిటిష్ కాలనీ యుగంలో జరిగే కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సమాచారం. అణచివేతకు వ్యతిరేకంగా ఒక మనిషి ఎదిగిన తీరును చూపించే హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని, ఇందులో మనోజ్ పాత్ర ‘డేవిడ్ రెడ్డి’ అని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ మరియా క్లారా విట్‌మోర్ పాత్రలో నటిస్తున్నారు. ‘ఆమె ప్రేమే యుద్ధం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం నుంచి ఆమె పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకుడు. ఈ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మనోజ్ పోస్టర్‌ అభిమానులను ఫిదా చేసింది. అలాగే డిసెంబర్‌లో రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దీనికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

READ ALSO: IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!

Exit mobile version