NTV Telugu Site icon

Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మీ ఇల్లు ఎంత బాగుందో చూశారా?.. వీడియో వైరల్..

Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ గురించి అందరికీ తెలుసు.. నటిగా అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా తాను ముంబై కి షిఫ్ట్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. అంతేకాదు అక్కడ కొన్న సొంత ఇల్లు గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.. తాజాగా ఆ ఇల్లు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా అందంగా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్‌ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. చివరికి తనకు నచ్చిన ప్లాట్ ను కొన్నట్లు చెప్పింది.. అయితే అక్కడ ఉన్న వస్తువులు అన్ని కూడా హైదరాబాద్ నుంచి తెచ్చినవే అని చెప్పుకొచ్చింది..

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. సౌత్‌లో చాలా రకాల రోల్స్‌ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్‌ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను.. స్టార్ హోదాను అందుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.. మరి ఏ హీరో సినిమాలో కనిపిస్తుందో చూడాలి..