Maname OTT: సినిమా విజయం, అపజయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తించుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకడు శర్వానంద్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా పొందాడు. ఈ హీరో చివరగా నటించిన సినిమా ‘మనమే’. రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్ట లేకపోయింది. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. సినిమా కొద్దిమేర పర్వాలేదనిపించుకుంది. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 22 కోట్ల వసూలు రాబట్టగలిగింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు నుంచో చాలామంది ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు చాలా రోజుల నుంచి నిరాశ ఎదురవుతుంది.
Wayanad landslides: వయనాడ్ బాధితుల కష్టాలు విని చలించిన ప్రధాని మోడీ
ఇకపోతే., ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ లోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటిపి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ అది త్వరలో అధికారికంగా ప్రకటన చేయబోతోంది. అంటే దాదాపు సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతోంది ‘మనమే’.