Site icon NTV Telugu

Mana Shankara Varaprasad: మెగా మూవీ సెట్ లోకి అడుగుపెట్టబోతున్న విక్టరీ వెంకటేష్..!

Mana Shankara Varaprasad

Mana Shankara Varaprasad

Mana Shankara Varaprasad: టాలీవుడ్‌లో తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్ మేళవించి ప్రేక్షకులను మెప్పించిన సూపర్‌హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్‌ తో ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తతోనే ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. వెంకటేష్‌తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన అనిల్.. ఈసారి చిరుతో మరింత భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని మెగా అభిమానులు నమ్ముతున్నారు.

Tollywood Movie Shootings: వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా స్టార్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?

ఇకపోతే ఫిలిం సర్కిల్స్‌లో ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ హల్‌చల్ చేస్తోంది. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు చిరు సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త చాలా రోజులుగా చర్చనీయాంశమవుతున్నా.. వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొనకపోవడంతో కొంత అనుమానం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ వెంకటేష్ అక్టోబర్ 21 నుంచి మెగాస్టార్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో పాటు ఎమోషన్ కలబోసిన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. దీంతో చిరు, వెంకీ కాంబినేషన్ మళ్లీ తెరపై చూడబోతున్న అభిమానులు సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మొత్తానికి, మన శంకర వరప్రసాద్ గారు చిత్రం టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో భారీ సంచలనాన్ని సృష్టించబోతుందనే నమ్మకం పెరుగుతోంది.

Bollywood : దీపావళి రేస్ లో రష్మిక సినిమాకు పోటీగా వస్తున్న హర్షవర్థన్ రాణే

Exit mobile version