NTV Telugu Site icon

Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!

Fake Ias

Fake Ias

Fake IAS Officer: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఐఏఎస్‌ అధికారిలాగా నటించి ఒక మహిళను మోసగించినందుకు 61 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వీవీఐపీ కోటాలో రాజర్‌హత్ మెగాసిటీలో రెండు ప్రభుత్వ ఫ్లాట్‌లను కేటాయిస్తామని, విదేశీ మద్యం లైసెన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ శాంతో కుమార్ మిత్రా అనే నిందితుడు ఓ మహిళ, ఆమె కుమార్తె నుంచి రూ.11.80 లక్షలు లాగేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో మంజు ఘోష్ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తాను తన కుమార్తెతో కలిసి ‘నకిలీ’ ఐఏఎస్‌ అధికారికి రూ.11.76 లక్షలు చెల్లించామని, అయితే అతను ఎలాంటి హామీలను నెరవేర్చలేదని లేదా మొత్తం మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Romantic Fight: రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య.. ఆ తర్వాత ఏమైందంటే?

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడాది కాలంగా తలదాచుకున్న బర్తాలాలోని ఓ హోటల్‌లో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని హోటల్ గదిలో కొన్ని నేరారోపణ పత్రాలు లభించాయని పోలీసులు తెలిపారు. హోటల్ ముందు పార్క్ చేసిన అతని ఐ20 కారుపై పలు ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి నిజానికి బెలేఘాటా నివాసి అయితే కొన్నిసార్లు హరిదేవ్‌పూర్ ప్రాంతంలో కూడా ఉండేవాడని పోలీసులు తెలిపారు.

Show comments